పెళ్లికి ప్రభాస్ దర్శకుడు రెడీ
on Jun 3, 2020

ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనేది చెప్పడం కష్టమే! టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ రానా దగ్గుబాటి, నితిన్ సైతం పెళ్లికి రెడీ అయ్యారు. ప్రభాస్ పెళ్లికి ఎప్పుడు రెడీ అవుతాడో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఆఖరికి ప్రభాస్ అంటే చాలా చిన్నోడు, ప్రభాస్ హీరోగా 'సాహో' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సుజీత్ కూడా పెళ్లికి రెడీ అయ్యాడు.
జూన్ 10న సుజిత్ నిశ్చితార్థం జరగనుందని విశ్వసనీయవర్గాల సమాచారం. అతడికి ప్రేమ వివాహం అని తెలుస్తోంది. డాక్టర్ ప్రవళికతో సుజిత్ ఏడడుగులు వేయనున్నారు. వృత్తిరీత్యా ప్రవళిక డాక్టర్ అయినా ఆమెకు సినిమాలంటే అమితాసక్తి. టిక్ టాక్ లో పాటలు పాడటం ద్వారా ఫేమస్ అయ్యారు. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే విభాగంలో పనిచేశారట. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య పరిచయం ఉందని అది ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది ఇండస్ట్రీ టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



