పోకిరి రికార్డు బద్దలు కొట్టడానికి 11 ఏళ్ళు పట్టింది
on Jul 6, 2017

ఇండస్ట్రీ లో ఏ రికార్డులు శాశ్వతం కాదు. కొంత సమయం పట్టొచ్చు కానీ ఎంతటి రికార్డు అయినా బద్దలు కావడం మాత్రం ఖాయం. అమితాబ్ బచ్చన్ నటించిన షోలే ఒక థియేటర్ లో అయిదు సంవత్సరాలకు పైగా ఆడితే, ఆ రికార్డు బ్రేక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు అనుకున్నారు. షారుఖ్ ఖాన్ దిల్ వాలే దుల్హనియా లేజాయింగే దాదాపు 20 సంవత్సరాలు మరాఠా మందిర్ అనే ముంబై థియేటర్లో ఆది సరి కొత్త రికార్డ్ నెలకొల్పింది. హిందీ లో స్టార్ హీరో సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేస్తుంటే, ఇది తెలుగు సినిమా కి సాధ్యమా అనుకున్నంతలో మన సినిమా వెయ్యి కోట్ల మైలు రాయి దాటి రెండు వేల కోట్ల దరిదాపుల్లోకి వెళ్ళింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా తన ప్రభంజనం కొనసాగించింది. ఈ సినిమా గనక చైనా లో విడుదలయితే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
దంగల్ రికార్డుల్ని కొల్లగొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు ట్రేడ్ పండితులు. అయితే, బాహుబలి 2 ఇప్పుడు గత 11 సంవత్సరాలుగా ఎవరికీ సాధ్యం కానీ రికార్డు ఒకటి బద్దలు కొట్టింది. అదేంటంటే, మహేష్ బాబు పోకిరి ఒక సింగల్ థియేటర్ లో 1 .62 కోట్ల వసూళ్లు రాబట్టింది. సుదర్శన్ 35 లో ఈ సినిమా ఇంత కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు ఆ రికార్డుని బాహుబలి 2 బ్రేక్ చేసింది. వైజాగ్ లోని మెలోడీ థియేటర్లో అప్రతిహాతంగా ప్రదర్షింపబడుతున్న బాహుబలి 2 ఇప్పటి వరకు 1 .64 కోట్లకు పైగా వసూళ్లు సాధిందించి. మరి ఈ రికార్డుని బద్దలు కొట్టడానికి ఎంత సమయం పడుతుందో చూడాలి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



