టీజర్ రివ్యూ: జైలవకుశ
on Jul 6, 2017
.jpg)
జై లవకుశలో ఒక ఎన్టీయర్ పేరు ‘జై’. ఈ పాత్ర విలన్ తరహా పాత్ర. అంటే... రావణాసురుణ్ణి పోలుండే పాత్ర. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్లో ఆ విషయం తేటతెల్లమైందని చెప్పాలి. ‘అసుర... అసుర ... అసుర..’ అంటూ దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం మధ్య రావణాసురుడి విగ్రహానికి దణ్ణం పెడుతూ.. ఎన్టీయార్ ఎట్రన్స్ జరిగింది. యాంటీ లుక్స్ తో కొత్త తరహా ఎన్టీయార్ ఈ ట్రైలర్ లో కనిపించాడని చెప్పాలి. ‘‘ఆ రావణున్ని చంపాలంటే సముద్రం దాటి రావాలి. ఈ రావణున్ని సంపాలంటే.. సముద్రమంత ధైర్యం ఉండాలి’’ అనే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్. సింహాసనంపై కూర్చొని వికటాట్టహాసం చేస్తున్న ఎన్టీయార్ని చూస్తే ఫ్యాన్స్ కి పండగే అనాలి. ఇప్పుడు ‘జై’ పాత్రను ఈ ట్రైలర్ ద్వారా పరిచయం చేశారు. రాబోయే ట్రైలర్స్ లో లవకుశల్ని పరిచయం చేస్తారన్నమాట. ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీయార్ పెర్ఫార్మన్స్ ,దేవిశ్రీ సంగీతం ఈ ట్రైలర్ లో హైలైట్. కల్యాణ్ రామ్ ఖర్చుకు వెనుకాడలేదని ట్రైలర్ చెప్పకనే చెప్పింది. ఎన్టీఆర్, బాబీ కాంభినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



