'బెదురులంక'లో కార్తికేయ, నేహా శెట్టి.. యుగాంతమేనా?
on Sep 21, 2022

కార్తికేయ, నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వంలో ఈ ఏడాది ఏప్రిల్ లో ఒక మూవీ ప్రారంభమైంది. తర్వాత ఈ సినిమాకి సంబంధించి పెద్దగా అప్డేట్స్ లేవు. అయితే తాజాగా ఈ చిత్ర టైటిల్ ని ప్రకటించి సర్ ప్రైజ్ చేసింది మూవీ టీమ్.
నేడు(సెప్టెంబర్ 21న) కార్తికేయ పుట్టినరోజు. ఈ సందర్భంగా మూవీ టైటిల్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి 'బెదురులంక 2012' అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ లోని ఓ లంక గ్రామం నేపథ్యంలో ఓ విభిన్న కథతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. టైటిల్ లోని '2012'లో '0' లోపల '12/2012' అని రాసుంది. దట్టమైన మేఘాలు, గ్రామాన్ని ముంచెత్తేలా నీళ్ల అలజడి, ఆకాశంలో గద్ద.. ఇవన్నీ చూస్తుంటే 2012 యుగాంతం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు అనిపిస్తోంది. యుగాంతం వార్తల నేపథ్యంలో ఆ సమయంలో లంక గ్రామంలోని ప్రజలు ఎలా భయంభయంగా బతికారోనన్న పాయింట్ తో కథనం ఆసక్తికరంగా సాగనుందని, అందుకే ఈ చిత్రానికి 'బెదురులంక 2012' అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది.

లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 'ఆర్ఎక్స్ 100' తర్వాత సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న కార్తికేయ ఈ చిత్రంతో హిట్ అందుకుంటాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



