శోభన్ బాబుగా 'అశ్వథ్థామ'లో విలన్
on Feb 17, 2020

దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, అలనాటి అందగాడు శోభన్ బాబు మధ్య ప్రేమ గురించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. శోభన్ బాబు, ఎంజీఆర్ ప్రస్తావన లేని జయలలిత జీవితాన్ని ఊహించలేం. ఆవిడ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'తలైవి'లో ఎంజీఆర్, శోభన్ బాబులను చూపిస్తున్నారు తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్. ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రలో అరవిందస్వామి నటిస్తున్న సంగతి తెలిసిందే. శోభన్ బాబు పాత్రకు బెంగాలీ నటుడు జిష్షు సేన్ గుప్తాను తీసుకున్నారు. ఆల్రెడీ జిష్షు సేన్ గుప్తా రెండు తెలుగు సినిమాల్లో నటించారు. నందమూరి తారకరామారావు బయోపిక్ 'యన్.టి.ఆర్'లో ఎల్వీ ప్రసాద్ పాత్రలో జిష్షు కనిపించారు. ఇటీవల విడుదలైన 'అశ్వథ్థామ'లో విలన్ గా నటించిందీ ఆయనే. తెలుగులో రెండు సినిమాలే చేసినప్పటికీ... జిష్షు చాలా సీనియర్ యాక్టర్. ఆల్రెడీ బెంగాలీ, హిందీలో దాదాపు 100 సినిమాలు చేశారు. క్రిటిక్స్ మెచ్చిన నటుడే. శోభన్ బాబుగా నటించాలని అడిగిన వెంటనే అంగీకరించాడట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



