త్రిష, హన్సిక లేరు... ఈసారి రాశీ ఖన్నా
on Jan 21, 2020

పాలకోవా లాంటి హన్సికను 'చంద్రకళ' సినిమాలో ఆత్మగా చూపించిన ఘనత సుందర్ సి సొంతం. హారర్ సినిమాలు చూడడానికి భయపడే హన్సికతో ఆయన హారర్ సినిమా తీశారు. అదే 'అరణ్మణై'. తమిళంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో 'చంద్రకళ'గా విడుదలైంది. ఇందులో సుందర్ సి మెయిన్ హీరో. 2014లో ఈ సినిమా వచ్చింది. తర్వాత రెండేళ్లకు సీక్వెల్ తీశారు. 'అరణ్మణై 2'లో సిద్ధార్థ్, త్రిష జంటగా నటించారు. అందులోనూ సుందర్ సి మెయిన్ హీరో. ఇప్పుడు ఈ సినిమాకు మరో సీక్వెల్ తెరకెక్కించడానికి ఆయన రెడీ అయ్యారు. అయితే... ఇందులో త్రిష, హన్సిక లేరు. ఈసారి రాశి ఖన్నాను తీసుకున్నారు.
'అరణ్మణై 3'లో రాశి ఖన్నా హీరోయిన్. సినిమాలో నటిస్తున్న ఆమె ధ్రువీకరించారు. రాశి ఖన్నా నటిస్తున్న మొదటి హారర్ సినిమా ఇది. ఆమె ఆర్య పక్కన హీరోయిన్ గా నటించనున్నట్టు సమాచారం. ఇందులోనూ సుందర్ సి హీరోగా నటిస్తారు. మొదటి రెండు సినిమాల్లో నటించిన ఆండ్రియా కీలక పాత్రలో కనిపిస్తారు. ఫిబ్రవరి మంత్ ఎండ్ లేదా మార్చిలో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



