పవన్ లుక్ టెస్ట్ మాత్రమేనా? షూటింగ్ కూడా చేశాడా?
on Jan 21, 2020

హిందీ హిట్ 'పింక్' రీమేక్ తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఫిక్స్. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తి చేశారు. షూటింగ్ స్టార్ట్ చేయడమే తరువాయి అని, సంక్రాంతి తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తారని ఎప్పుడో వార్తలు వచ్చాయి. అనుకున్నట్టుగా షూటింగ్ స్టార్ట్ చేశారు కూడా. ఇంటర్నెట్ అంతా పవన్ కల్యాణ్ 'పింక్' రీమేక్ షూటింగ్ లో పాల్గొన్న స్టిల్ ఒకటి వైరల్ అయింది. అయితే, అసలు మేటర్ ఏంటంటే... పవన్ లుక్ టెస్ట్ కోసమే సోమవారం హైదరాబాద్ లో అల్వాల్, ఓల్డ్ బోయినపల్లి ఏరియాల్లో కొంత షూట్ చేసి చెక్ చేసుకున్నారు. ప్రస్తుతం బయట కనిపించే గడ్డంతో పవన్ షూట్ చేశారు. ఈ సినిమాకు మూలకథ హిందీ 'పింక్' నుండి తీసుకున్నప్పటికీ... తమిళంలో అజిత్ చేసిన 'పింక్' రీమేక్ ను ఫాలో అవ్వాలని అనుకుంటున్నారట. అందులో అజిత్ గడ్డంతో కనిపిస్తారు. 'పింక్'లో అమితాబ్ బచ్చన్ లా కాకుండా ఎక్కువ గడ్డం ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో గడ్డం తీసేసి హాండ్సమ్ లుక్ లో ఉంటారు. సోమవారం తీసిన ఫుటేజ్ తో పవన్ హ్యాపీగా ఉంటే మంగళవారం షూటింగ్ ఉంటుంది. లేదంటే చిన్న చిన్న మార్పులు చేసుకుంటారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



