కృతితో ప్రేమలో ప్రభాస్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
on Sep 20, 2022

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి వార్త కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించారన్న బాధలో ఉన్న ఈ సమయంలో.. ప్రభాస్ ప్రేమలో ఉన్నాడంటూ కొందరు ప్రచారం చేయడం ఆయన ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పిస్తోంది.
ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఆదిపురుష్'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దశలో ఉంది. అయితే ఈ మూవీ షూటింగ్ టైంలో ప్రభాస్, కృతి ఒకరిపై ఒకరు మనసు పారేసుకున్నారని.. ప్రస్తుతం ఇద్దరు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అసలే పెదనాన్న చనిపోయారన్న బాధలో ప్రభాస్ ఉంటే, ఈ సమయంలో ఆయన ప్రేమలో ఉన్నారంటూ గాసిప్స్ క్రియేట్ చేయడం ఏంటంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
టీ సిరీస్ ఫిలిమ్స్, రెట్రోఫిల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి కనిపించనుండగా.. రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ అలరించనున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ మైథలాజికల్ ఫిల్మ్ జనవరి 12, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



