దీపిక భర్తకు ఓకే చెప్పిన శంకర్... సూర్య పరిస్థితేంటి?
on Nov 8, 2022
.webp)
అత్యంత ప్రజాదరణ పొందిన నవలలను తెరకెక్కించడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు నయా ఫ్యాషన్. ఆల్రెడీ 'పొన్నియిన్ సెల్వన్' నవలను సినిమాగా తెరకెక్కించి కలెక్షన్లలో 500 కోట్ల మార్కును టచ్ చేశారు మణిరత్నం. ఇప్పుడు మణిరత్నం బాటలో నడవడానికి రెడీ అయ్యారు శంకర్. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి 'వెల్పారి' అనే నవలను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడానికి సిద్ధమవుతున్నారు శంకర్.
ఆల్రెడీ శంకర్, రణ్‌వీర్ కలిసి 'అన్నియన్' (అపరిచితుడు) హిందీ రీమేక్ చేయాల్సింది. కానీ అది పట్టాలెక్కలేదు. ఇప్పుడు 'వెల్పారి' సినిమాను మూడు పార్టులుగా తెరకెక్కించాలని నిర్ణయించారట శంకర్. ఆ కథ విని వెంటనే ఓకే చెప్పేశారట రణ్‌వీర్. లార్జర్‌దేన్ లైఫ్ యాక్షన్ సీక్వెన్స్, జైగాంటిక్ హీరోయిజమ్, మనసులను తాకే ప్రేమకథ, విజువల్ వండర్స్ కి స్కోప్ ఉన్న సన్నివేశాలతో, అన్ని వర్గాల వారినీ అట్రాక్ట్ చేసే సినిమా అవుతుందట 'వేల్పారి'.
ఈ సినిమాను వచ్చే ఏడాది సెకండాఫ్‌లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు శంకర్. ప్రస్తుతం ఆయన 'ఆర్సీ 15', 'ఇండియన్2' సినిమాలతో బిజీగా ఉన్నారు. శంకర్ తెరకెక్కించబోయే 'వేల్పారి'లో సూర్య హీరోగా నటిస్తారని, హోంబలే సంస్థ నిర్మిస్తుందని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు శంకర్, రణ్‌వీర్ సింగ్ కెరీర్లలోనే అత్యంత హై బడ్జెట్ సినిమా ఇదే అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ 'బ్రహ్మాస్త్ర 2'లోనూ రణ్‌వీర్ సింగ్ పేరే వినిపిస్తోంది. అదే జరిగితే అటు భక్తి చిత్రం, ఇటు నవలా చిత్రంలో నాయకుడిగా అట్ ఎ టైమ్ రెండు సినిమాలకు పనిచేయాల్సి వస్తుంది రణ్‌వీర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



