చావుతో ఇంకా పోరాడుతున్నానన్న సమంత!
on Dec 28, 2022

సౌత్ ఇండియాలో కేవలం తన బ్రాండ్ ఇమేజ్ ద్వారా ప్రేక్షకులను థియేటర్స్ రప్పించే సత్తా ఉన్న అతి తక్కువ మంది హీరోయిన్లలో సమంత ఒకరు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లో కూడా దాదాపు ఆమె పలు చిత్రాలు నటించింది. ఈమె పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసి సక్సెస్ అందుకుంది. ఈమె ప్రధాన పాత్రలో రూపొందిన లేటెస్ట్ చిత్రం యశోద. ఈ చిత్రం ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మరో పక్క ఆమె మయో సిటీస్ అనే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ ఉంది.
ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సమంత త్వరగా కోలుకోవాలని ఆమె సినిమాల్లో నటిస్తూ అందరిని అల్లరించాలని సోషల్ మీడియాలో అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం చికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకున్న సమంత సంక్రాంతి తర్వాత షూటింగ్స్ లో పాల్గొనడానికి సిద్ధమవుతోంది. ఆమె ఇప్పటికే ఒప్పుకొని ఉన్న విజయ్ దేవరకొండ తో నటిస్తున్న ఖుషి, గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న శాకుంతలం చిత్రాలను ముందుగా పూర్తిచేసి నిర్మాతలకు ఇబ్బంది కలుగకుండా చేయాలని ఆలోచిస్తుంది.
ఇది ఇలా ఉండగా సమంతతో ఇండస్ట్రీలో సన్నిహితంగా ఉండే కొంతమంది సెలబ్రిటీస్ లో ఒకరు రాహుల్ రవిచంద్రన్. ఈ అందాల రాక్షసి ఫేమ్ తాజాగా ఇంస్టాగ్రామ్ లో సమంతని ట్యాగ్ చేస్తూ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు హాట్‌టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నువ్వు చీకటి దారిలో ప్రయాణం సాగిస్తూ ఉండొచ్చు. కానీ త్వరలోనే ఆ దారి ప్రకాశంతో నిండిపోతుంది. ప్రస్తుతం నీ శరీర భాగాల కదలిక కాస్త కష్టంగా అనిపించొచ్చు. కానీ త్వరలోనే అవి మామూలు స్థితికి చేరుకుంటాయి. ఎందుకంటే నువ్వు ఉక్కు మహిళవు. పోరాడటం నీ నైజం... గెలుపొందడం నీ హక్కు.... ఎలాంటి కఠినతరమైన పరిస్థితులు ఎదురైనా నిన్ను విధి ఓడించలేదు.
ఇలాంటివి జీవితంలో ఎన్నో చూసావు. ఇవ్వన్నీ నీ విజయానికి మెట్లుగా నిలుస్తాయి అంటూ అతను పెట్టిన పోస్ట్ ని సమంత షేర్ చేస్తూ కఠిన తరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ నన్ను ఆదర్శంగా తీసుకోండి. చావుతో పోరాడుతున్నాను. నేను మీరు కూడా అలాగే ఉండండి. అవే మనల్ని ఇంకా బలవంతును చేస్తాయి అంటూ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



