'అంతరిక్షం'లో నో విలన్
on Dec 20, 2018
ప్రతినాయకుడు ఎంత బలంగా ఉంటే... కథానాయకుడి వీరత్వం, ధీరత్వం అంత బయట పడుతుందని మన సినిమా జనాలు నమ్మే సూత్రం. హీరోయిజం పండాలంటే... విలన్ స్ట్రాంగ్‌గా ఉండాలని, విలన్‌ని స్ట్రాంగ్‌గా చూపిస్తారు. సగటు కమర్షియల్ సూత్రాలకు, తెలుగు సినిమాలకు భిన్నంగా 'ఘాజీ' చిత్రాన్ని తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి... తాజా 'అంతరిక్షం'ను అలాగే తెరకెక్కించారు. వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో ప్రత్యేకించి విలన్ ఎవరూ లేరు. సినిమా గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ "నలుగురు సైంటిస్టులు స్పేస్ లోకి వెళతారు. అక్కడ వారికి ఒక సమస్య వస్తుంది. దాన్ని ఎలా ఫిక్స్ చేశారనేది సినిమా కథ. ఇందులో విలన్ ఎవరూ లేరు" అన్నారు. వందల కోట్ల నిర్మాణ వ్యయంతో హాలీవుడ్ స్పేస్ మూవీస్ తెరకెక్కిస్తారని, పరిమిత నిర్మాణ వ్యయంలో తాము క్వాలిటీ సినిమా తీశామని వరుణ్ తేజ్ అన్నారు. జీరో గ్రావిటీ సన్నివేశాల్లో నటించడానికి చిత్రీకరణకు ముందు రెండు మూడు వారాలు శిక్షణ తీసుకున్నామని తెలిపారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కరెక్టుగా ప్లాన్ చేసుకోవడంతో పెద్ద సినిమాను 70, 80 రోజుల్లో పూర్తి చేశామని అన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
