‘చీల్చి చెండాడేస్తా నా కొడకా’ అంటూ వార్నింగ్ ఇచ్చిన అనసూయ
on Jul 20, 2022

స్మాల్ స్క్రీన్ తో పాటు సిల్వర్ స్క్రీన్ మీద కూడా తానేంటో నిరూపించుకుంది యాంకర్ అనసూయ. మూవీస్ లో డిఫరెంట్ రోల్స్ చేస్తూ ప్రామిసింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనిపించుకుంది కూడా. ఇక ఇప్పుడు ఆమెకు వరసగా మూవీ ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు "దర్జా" గా భయపెట్టడానికి ఒక సూపర్ పవర్ ఫుల్ రోల్ లో ఆడియన్స్ కి దర్శనమివ్వబోతోంది. ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ జరిగింది. ఇందులో ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది అనసూయ. దర్జా మూవీలో కనకం పాత్రలో భయపెట్టడానికి ప్రయత్నించాను..ఇదొక వండర్ ఫుల్ మూవీ అని చెప్పింది. ఈ మూవీ ప్రమోషన్స్ ఫంక్షన్ లో నేను పాల్గొనలేకపోయాను దీనికి నా తరపున సారీ అంటూ మూవీ టీం కి చెప్పింది.
తన లైఫ్ లో ఫస్ట్ టైం యాక్షన్ సీన్స్ చేశానని చెప్పింది అనసూయ. చీరతో నేను విన్యాసాలు చేసాను, అలాగే సింగల్ హ్యాండ్ తో గొడుగు తిప్పాను అంటూ తాను చేసిన సీన్స్ గురుంచి వివరించింది. ఇదే టైంలో మూవీలోంచి అద్దిరిపోయే పంచ్ డైలాగ్ కూడా చెప్పేసింది. "నువ్వు బెదిరిస్తే భయపడటానికి ఇంట్లో కూర్చున్న ఆడదాన్ని అనుకున్నావ్ రా ..చీల్చి చెండాడేస్తా నా కొడకా " అంటూ చెప్పి ఆడియన్స్ కి ఎంటర్టైన్ చేసింది. ఎలాగో మూవీ కొద్దీ రోజుల్లో ఓటిటికి వచ్చేస్తుంది. ఐనా ఇంట్లో నాలుగు గోడల మధ్య చూస్తే ఎం కిక్ ఉంటుంది దర్జాగా థియేటర్స్ కి వచ్చి మూవీ చూడండి మా టీంని ప్రోత్సహించండి అంటూ చెప్పింది అనసూయ. జులై 22 న రిలీజ్ అయ్యే ఈ మూవీలో అనసూయ ఎలా భయపెడుతుందో..ఎలాంటి ఇంటరెస్టింగ్ సీన్స్ చేసిందో చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



