ప్రముఖ నిర్మాత కొడుకుతో పెళ్లి.. థాంక్స్ చెప్పిన అనన్య!
on Oct 2, 2022

'మల్లేశం' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల.. 'వకీల్ సాబ్', 'మ్యాస్ట్రో' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ కుర్రకారుకి దగ్గరైన ఈ యంగ్ బ్యూటీ ఓ ప్రముఖ నిర్మాత కుమారుడిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను ఖండిస్తూ తనదైన శైలిలో చురకలు వేసింది అనన్య.
టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నిర్మాత రెండు కుమారుడితో అనన్య వివాహమని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా స్పందించిన అనన్య.. " నా కోసం వరుడిని చూసినందుకు థాంక్స్. అలాగే అతను ఎవరు? పెళ్లి ఎప్పుడు, ఏ టైంకి? వంటి వివరాలు చెప్పండి. దానివల్ల నా పెళ్ళికి నేను రాగలుగుతాను" అంటూ సెటైరికల్ ట్వీట్ చేసి పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



