'గాడ్ ఫాదర్' అడ్వాన్స్ బుకింగ్ కి మంచి రెస్పాన్స్!
on Oct 2, 2022
మెగాస్టార్ చిరంజీవి గత చిత్రం 'ఆచార్య' ఘోర పరాజయాన్ని చూసింది. అప్పటిదాకా అపజయమెరుగని దర్శకుడైన కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మొదటిసారి తండ్రీకొడుకులు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించారు. పైగా ఇది 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ నటించిన సినిమా కావడం విశేషం. ఇన్ని పాజిటివ్ లు ఉన్నప్పటికీ ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. పైగా మొదటి షో నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకొని టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో చిరంజీవి తదుపరి సినిమా 'గాడ్ ఫాదర్'పై అందరి దృష్టి పడింది.
మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్' మూవీకి తెలుగు రీమేక్ గా వస్తున్న చిత్రం 'గాడ్ ఫాదర్'. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకుడు. ఇది రీమేక్ సినిమా కావడం, పైగా దర్శకుడు కూడా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవడంతో.. 'గాడ్ ఫాదర్'కి మెగాస్టార్ స్థాయికి తగ్గ ఓపెనింగ్స్ వస్తాయా అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా 'గాడ్ ఫాదర్' అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా మంచి రెస్పాన్సే వస్తుంది. ఫస్ట్ డే కి టికెట్స్ బాగానే బుక్ అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి రోజు టాక్ ని బట్టి ఓపెనింగ్స్ పెరిగే అవకాశముంది. మరి ఆచార్యతో ఫ్యాన్స్ ని నిరాశపరిచిన మెగాస్టార్ గాడ్ ఫాదర్ తో లెక్క సరిచేస్తాడేమో చూడాలి.
Also Read