ఎన్టీఆర్, చరణ్ ల కోసం మనసు మార్చుకున్న రాజమౌళి
on Mar 15, 2018

బాహుబలి సినిమా తర్వాత గ్రాఫిక్స్ అంటే విసుగు వచ్చిందని... తన తదుపరి సినిమాల్లో గ్రాఫిక్స్ లేకుండా చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చిన రాజమౌళి తన మనసు మార్చుకున్నట్టున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో జక్కన్న ఒక మల్టి స్టారర్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా లుక్ టెస్ట్ కోసం వీరిద్దరూ అమెరికా వెళ్లి వచ్చారు. అయితే, ఎన్టీఆర్, చరణ్ ల యుఎస్ టూర్ వెనుక ఇంకో విశేషం ఉంది. అక్కడ టెక్నికల్ టీం వీరిద్దరికీ బాడీ స్కానింగ్ చేసిందట. ఇంతకీ, ఈ స్కానింగ్ ఎందుకు చేశారంటారా? ఈ సినిమాలో కూడా గ్రాఫిక్స్ పెద్ద మొత్తంలో ఉంటాయట. మొత్తానికి, చరణ్, ఎన్టీఆర్ ల కోసం రాజమౌళి గ్రాఫిక్స్ విషయంలో తన మనసు మార్చుకున్నాడు. సెప్టెంబర్ లో షూటింగ్ మొదలవనుండగా, రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ అన్నదమ్ములుగా కనిపించనున్నారట. బాహుబలి తో బాక్స్ ఆఫీస్ షేక్ చేసిన రాజమౌళి, ఈ మల్టి స్టారర్ తో కొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



