2022 ఫస్టాఫ్ రివ్యూ1: సక్సెస్‌ని కొనసాగించిన ప్రముఖులు!
on Jun 20, 2022

2022 ప్రథమార్ధం పలువురు సినీ ప్రముఖులకు భలేగా కలిసొచ్చింది. వీరిలో కొందరు తమ విజయపరంపరని కొనసాగించారు. వారి వివరాల్లోకి వెళితే..
నాగచైతన్య - కృతి శెట్టిః
జనవరి 14న విడుదలైన `బంగార్రాజు`తో నాగచైతన్య, కృతి శెట్టి విజయాలను కొనసాగించారు. `మజిలీ`, `వెంకీమామ`, `లవ్ స్టోరి` వంటి హిట్స్ తరువాత `బంగార్రాజు`తో చైతూ వరుసగా నాలుగో విజయం తన ఖాతాలో వేసుకోగా.. `ఉప్పెన`, `శ్యామ్ సింగ రాయ్` అనంతరం వచ్చిన `బంగార్రాజు`తో హ్యాట్రిక్ క్రెడిట్ చేసుకుంది కృతి.
సిద్ధు జొన్నలగడ్డః
ఫిబ్రవరి 12న రిలీజైన `డీజే టిల్లు`తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ.. ఓటీటీ హిట్స్ `కృష్ణ అండ్ హిజ్ లీల`, `మా వింత గాథ వినుమా` తరువాత తన విజయ పరంపరని కొనసాగించినట్లయ్యింది.
పవన్ కళ్యాణ్ః
గత ఏడాది విడుదలైన `వకీల్ సాబ్`తో రి-ఎంట్రీ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్.. ఈ ఫిబ్రవరి 25న సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చిన `భీమ్లా నాయక్`తో విజయ పరంపరని కొనసాగించినట్లయ్యింది.
ఎన్టీఆర్ - రాజమౌళిః
మార్చి 25న రిలీజైన పాన్ - ఇండియా బ్లాక్ బస్టర్ `ఆర్ ఆర్ ఆర్`.. అటు జూనియర్ ఎన్టీఆర్, ఇటు దర్శకుడు రాజమౌళి జైత్రయాత్రని కొనసాగించింది. `టెంపర్`, `నాన్నకు ప్రేమతో`, `జనతా గ్యారేజ్`, `జై లవ కుశ`, `అరవింద సమేత` అనంతరం వచ్చిన `ఆర్ ఆర్ ఆర్`తో తారక్ డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకుంటే.. `స్టూడెంట్ నెంబర్ వన్`, `సింహాద్రి`, `సై`, `ఛత్రపతి`, `విక్రమార్కుడు`, `యమదొంగ`, `మగధీర`, `మర్యాద రామన్న`, `ఈగ`, `బాహుబలి - ది బిగినింగ్`, `బాహుబలి - ది కంక్లూజన్` తరువాత వచ్చిన `ఆర్ ఆర్ ఆర్`తో జక్కన్న వరుసగా 12వ విజయం క్రెడిట్ చేసుకున్నారు.
ప్రశాంత్ నీల్ః
`ఉగ్రం`, `కేజీఎఫ్ః ఛాప్టర్ 1`తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ చూసిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కి.. ఏప్రిల్ 14న తెరపైకి వచ్చిన `కేజీఎఫ్ః ఛాప్టర్ 2`తో హ్యాట్రిక్ దక్కింది. అలాగే రాకింగ్ స్టార్ యశ్ కి `కేజీఎఫ్` సిరీస్ తో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ సొంతమైనట్లయ్యింది.
మహేశ్ బాబు - మైత్రీ మూవీ మేకర్స్ - పరశురామ్ః
`భరత్ అనే నేను`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు`తో హ్యాట్రిక్స్ అందుకున్న మహేశ్ బాబు.. మే 12న రిలీజైన `సర్కారు వారి పాట`తో విజయపరంపరని కొనసాగించారు. అలాగే `ఉప్పెన`, `పుష్ప - ద రైజ్` అనంతరం మైత్రీ మూవీ మేకర్స్ ఖాతాలో హ్యాట్రిక్ క్రెడిట్ కాగా.. `గీత గోవిందం` తరువాత పరశురామ్ కి మరో హిట్ దక్కింది.
శివ కార్తికేయన్ః
గత చిత్రం `డాక్టర్`తో ఇంప్రెస్ చేసిన కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్.. మే 13న రిలీజైన `డాన్`తో మరో మెమరబుల్ హిట్ ని సొంతం చేసుకున్నారు.
వెంకటేశ్ - అనిల్ రావిపూడిః
మే 27న విడుదలైన `ఎఫ్ 3`.. అటు వెంకటేశ్, ఇటు అనిల్ రావిపూడికి డబుల్ హ్యాట్రిక్ అందించింది. `గురు`, `ఎఫ్ 2`, `వెంకిమామ`, `నారప్ప`, `దృశ్యం 2`, `ఎఫ్ 3`తో వెంకీ `నాన్ - ఫెయిల్యూర్స్` డబుల్ హ్యాట్రిక్ అందుకోగా.. `పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`, `సరిలేరు నీకెవ్వరు`, `ఎఫ్ 3`తో అనిల్ కూడా అదే బాట పట్టారు.
అడివి శేష్ - శశి కిరణ్ తిక్కః
జూన్ 3న జనం ముందుకు వచ్చిన `మేజర్`.. హీరో అడివి శేష్, దర్శకుడు శశి కిరణ్ తిక్క విజయపరంపరని కొనసాగించింది. `క్షణం`, `అమీ తుమీ`, `గూఢచారి`, `ఎవరు` తరువాత అడివి శేష్ ఖాతాలో వరుసగా అయిదో హిట్ చేరగా.. `గూఢచారి` తరువాత శశి కిరణ్ కి వరుసగా రెండో విజయం సొంతమైంది.
లోకేశ్ కనకరాజ్ః
జూన్ 3న విడుదలైన తమిళ చిత్రం `విక్రమ్`తో.. దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కి వరుసగా నాలుగో విజయం దక్కింది. ఇదివరకు లోకేశ్ ఖాతాలో `మానగరం`, `ఖైదీ`, `మాస్టర్` వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ ఉన్నాయి.
మరి.. 2022 సెకండాఫ్ లోనూ ఇదే తీరు కొనసాగుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



