మహేశ్, తారక్, చరణ్ తరహాలోనే బన్నీకి కూడా..!
on Jan 5, 2022

సంచలన విజయాలకు చిరునామాగా నిలుస్తున్న నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. ఒకవైపు అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూనే.. మరోవైపు యువ కథానాయకులతోనూ చిత్రాలు నిర్మిస్తోందీ అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ.
ఇదిలా ఉంటే.. స్టార్ హీరోలకి కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్స్ ని అందిస్తున్న ప్రొడక్షన్ హౌస్ గా మైత్రీ మూవీ మేకర్స్ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. తమ సంస్థ తొలి చిత్రం `శ్రీమంతుడు` (2015) విషయాన్నే తీసుకుంటే.. సదరు సినిమా సూపర్ స్టార్ మహేశ్ బాబుకి అప్పట్లో కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్. అలాగే మైత్రీ వారి సెకండ్ వెంచర్ `జనతా గ్యారేజ్` (2016) సంగతి తీసుకుంటే.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి కూడా అప్పట్లో ఇదే కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్. అదేవిధంగా మైత్రీ మూవీ మేకర్స్ హ్యాట్రిక్ ఫిల్మ్ `రంగస్థలం` (2018) కూడా అదే బాట పట్టింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఇప్పటికీ ఇదే అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమా. కట్ చేస్తే.. మైత్రీ వారి ప్రీవియస్ మూవీ `పుష్ప - ద రైజ్` (2021) కూడా అదే శైలిలో సాగుతూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ గా నిలుస్తోంది.
మొత్తమ్మీద.. మహేశ్, తారక్, చరణ్ తరహాలోనే బన్నీకి కూడా కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ అందించి మరోసారి వార్తల్లో నిలిచింది మైత్రీ మూవీ మేకర్స్. మరి.. భవిష్యత్ లో రాబోతున్న బిగ్ టికెట్ ఫిల్మ్స్ తోనూ ఈ క్రేజీ ప్రొడక్షన్ హౌస్.. ఆ పరంపరని కొనసాగిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



