సీతారామశాస్త్రి ఇంటికి వచ్చిన ప్రభాస్!
on Jan 5, 2022

ప్రభాస్ పబ్లిక్ అప్పీరెన్స్ ఇవ్వడం రేర్. అలాంటిది నిన్న రాత్రి జరిగింది. మంగళవారం రాత్రి అతను శ్రీనగర్ కాలనీ రోడ్‌లోని దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇంటిని సందర్శించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభాస్ రాకను గమనించిన స్థానిక అభిమానులు అతడిని చూసేందుకు ఎగబడ్డారు. లెజెండరీ లిరిసిస్ట్‌గా పేరుపొందిన సీతారామశాస్త్రి ఇటీవల ఊపిరితిత్తుల కేన్సర్‌తో మృతి చెందారు. ఇండస్ట్రీలో ఆయనను అభిమానించని వాళ్లు లేరు. ఆయన కుమారుల్లో యోగేశ్వరశర్మ సంగీత దర్శకుడు కాగా, రాజా నటునిగా రాణిస్తున్నాడు.
Also read: ఎన్టీఆర్ `గులేబకావళి కథ`కి 60 వసంతాలు.. విశేషాల మాలిక!
మంగళవారం రాత్రి తన లేటెస్ట్ లంబోర్గిని కారులో సీతారామశాస్త్రి ఇంటికి వచ్చిన ప్రభాస్, ఆయన సతీమణి, కుమారులను పరామర్శించి, కొద్దిసేపు గడిపాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి బయటకు వచ్చి, తన కారులో ఎక్కే సమయంలో పలువురు అభిమానులు అతడిని చుట్టుముట్టారు. వారందరికీ హాయ్ చెప్పి కారులో కూర్చొని వెళ్లిపోయాడు ప్రభాస్.
Also read: పవన్, సంపూ సినిమాలకి తేడా లేకపోతే.. మంత్రిగా మీకు, మీ డ్రైవర్ కి కూడా తేడా లేనట్లేనా?
కాగా, సంక్రాంతికి రావాల్సిన అతని సినిమా 'రాధేశ్యామ్' విడుదల పోస్ట్‌పోన్ అయ్యింది. జనవరి 14న సినిమాని విడుదల చేయాలని నిన్నటిదాకా నిర్మాతలు అనుకున్నారు. కానీ కొవిడ్ కేసులు శరవేగంగా పెరుగుతుండటంతో విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రేమకూ, విధికీ మధ్య జరిగే యుద్ధం 'రాధేశ్యామ్' కథ అని మేకర్స్ చెబుతున్నారు. అయితే 'రాధేశ్యామ్' విడుదలతో విధి ఆడుకుంటూ వస్తోంది. విడుదల వాయిదా పడటంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



