గోన గన్నారెడ్డి 'ఫస్ట్ లుక్' అదిరిపోయింది
on Oct 18, 2014
గుణశేఖర్ డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్నహిస్టారికల్ చిత్రం 'రుద్రమదేవి '. ఈ సినిమాలో అల్లు అర్జున్ గన్నారెడ్డిగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ ఈ సినిమాలో ఎలా కనిపించనున్నాడా అనే ఆసక్తి మెగా ఫ్యాన్స్‌లో నెలకొని వుంది. తాజాగా ఈ చిత్రంలోని అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. 'తెలుగు జాతి పౌరుషం. కాకతీయ వీర ఖడ్గం. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్' అంటూ ఓ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అంచనాలకు తగ్గట్టుగా బన్నీ గెటప్ ఫెరోషియాస్ గా వుండడంతో మెగా సంబరపడుతున్నారు. తాము వుహించిన దాని కంటే అల్లు అర్జున్ గెటప్ చాలా బాగుందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిని మీరు చూడండి.