'బాహుబలి' అంచనాలను మరింత పెంచేశారు
on Oct 18, 2014
.jpg)
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ కధనాయకుడిగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం బాహుబలి.రానా కీలక పాత్ర పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా కధనాయకులు. ఈ మూవీలో ప్రభాస్ లుక్ కి సంబంధించిన మరో పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కవచాలు, శిరస్ర్తాణం ధరించి, కరవాలం చేతపట్టి యుద్ధరంగంలో శత్రువలును చీల్చి చెండాడే యోధుడిగా ప్రభాస్ తాజా పోస్టర్‌లో దర్శనమిచ్చారు. మేకింగ్ ఆఫ్ బాహుబాలి పేరుతో ఇప్పటికే పలు వీడియోలను చిత్రం బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మిస్తుండగా, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



