అల్లు అయాన్ కు అర్థాలెన్నో
on Apr 13, 2014
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహరెడ్డిలకు ఇటీవలే కొడుకు పుట్టిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ బాబుకి "అయాన్" అనే పేరు పెట్టారు. ఈ పేరుకి సంస్కృతంలో "పవిత్రం", ఇస్లాంలో "దేవుడి బహుమతి", పెర్షియన్ లో "గుర్తుంచుకోదగ్గవాడు", హెబ్రూలో "ప్రశాంతం" అని అర్థం. ఇటీవలే విడుదలైన "రేసుగుర్రం" చిత్రం విడుదలై మంచి టాక్ ను సంపాదించుకొంది. అలాగే తన కొడుకుకి పెట్టిన పేరుపై కూడా మంచి స్పందన వస్తుండటంతో బన్నీ చాలా సంతోషంగా ఉన్నాడు.