కొత్తజంట పాటలు
on Apr 14, 2014
అల్లు శిరీష్, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం "కొత్తజంట". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, కె.రాఘవేంద్రరావు, వివి వినాయక్, సుకుమార్ వంటి పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. జె.బి. అందించిన ఈ చిత్ర పాటల తొలి సిడీని దర్శకులు కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. వివి వినాయక్ అందుకున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని అందరూ కోరుకున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.