రజనీకాంత్ రాణా క్యాన్సిల్ అవ్వలేదు
on May 20, 2011
రజనీకాంత్ "రాణా" క్యాన్సిల్ అవ్వలేదు అని ఆ చిత్ర దర్శకుడు కె.యస్.రవికుమార్ మీడియాకు తెలియజేశాడు. వివరాల్లోకి వెళితే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా త్రిపాత్రాభినయం చేస్తుండగా, కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో, నిర్మించబడుతున్న భారీ బడ్జెట్ చిత్రం "రాణా". ఈ రజనీకాంత్ "రాణా" సినిమా క్యాన్సిల్ అయిందని ఈ మధ్య మీడియాలో విభిన్నకథనాలు వచ్చాయి. కానీ అవన్నీ నిరాధారమైన వార్తలనీ, రజనీకాంత్ "రాణా" ఆయన పూర్తిగా కోలుకోగానే నిరాటంకంగా షూటింగ్ జరుపుకుంటుందని అన్నారు.
.jpg)
రజనీకాంత్ "రాణా" సినిమా ఆయన డ్రీమ్ ప్రోజెక్ట్ అనీ, అసలు ఇది రజనీ కాంత్ సార్ బ్రెయిన్ చైల్డ్ అనీ ఆ చిత్ర దర్శకుడు కె.యస్.రవికుమార్ మీడియాకు తెలియజేశారు. ఈ విషయంపై ఆయన ఇంకా మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకునే డేట్లు కూడా జూలై తర్వాతే ఈ సినిమా కోసం తీసుకున్నామనీ, రజనీకాంత్ "రాణా" సినిమాని 2012 వ సంవత్సరంలో విడుదల చేయనున్నామనీ దర్శకుడు కె.యస్.రవికుమార్ మీడియాతో అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



