'బబుల్ గమ్' ట్రైలర్.. మరో 'అర్జున్ రెడ్డి' అయ్యేలా ఉంది!
on Dec 15, 2023

నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమల తనయుడు రోషన్ కనకాల 'బబుల్ గమ్' అనే సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. మహేశ్వరీ మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'క్షణం', 'కృష్ణ అండ్ హిజ్ లీలా' చిత్రాలతో ఆకట్టుకున్న రవికాంత్ పేరేపు ఈ సినిమాకి దర్శకుడు. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో 'అర్జున్ రెడ్డి'లా ఉందనే కామెంట్స్ వినిపించాయి. తాజాగా 'బబుల్ గమ్' ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
'బబుల్ గమ్' ట్రైలర్ యూత్ మెచ్చేలా ఉంది. ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన యువకుడు, ఒక రిచ్ అమ్మాయితో ప్రేమలో పడటం.. వీరి ప్రేమ కథలోకి మరో వ్యక్తి రావడం.. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే ఆసక్తికర సన్నివేశాలతో ట్రైలర్ రూపొందింది. అమ్మాయి ప్రేమ కోసం తపించే యువకుడిగా రోషన్ కనిపిస్తున్నాడు. ప్రేమలో విఫలమై, ఆ బాధ నుంచి బయటపడి తానేంటో నిరూపించుకోవాలి అనుకుంటాడు. ట్రైలర్ ని బట్టి సినిమా బోల్డ్ గా ఉండబోతుందని అర్థమవుతోంది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే ఈ కంటెంట్ యూత్ కి కనెక్ట్ అయితే బాక్సాఫీస్ దగ్గర కాసులు కురవడం ఖాయమనిపిస్తోంది.
శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



