'ధీర'గా అఖిల్.. మరో భారీ రిస్క్!
on May 10, 2023

భారీ బడ్జెట్ తో రూపొందిన 'ఏజెంట్' దారుణంగా నిరాశపరిచినా అఖిల్ అక్కినేని మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ప్రయోగాలు, భారీ చిత్రాల జోలికి పోకుండా.. కొంతకాలం పాటు సింపుల్ లవ్ స్టోరీలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం అభిమానుల నుండి వ్యక్తమవుతున్నా అఖిల్ మాత్రం భారీ చిత్రాల వైపే మొగ్గు చూపుతున్నాడు.
అఖిల్ తన తదుపరి చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేయనున్నాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రంతో 'సాహో'కి దర్శకత్వ విభాగంలో పని చేసిన అనిల్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడట. ఈ చిత్రానికి 'ధీర' అనే పవర్ ఫుల్ టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కోసం సౌత్ నుంచి, నార్త్ నుంచి పలువురు స్టార్స్ ని రంగంలోకి దింపబోతున్నట్లు వినికిడి. విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుందని ఇన్ సైడ్ టాక్. భారీ తారాగణంతో పాన్ ఇండియా మూవీగా దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో రూపొందనుందట. మరి 'ఏజెంట్' తర్వాత మరో భారీ రిస్క్ చేస్తున్న అఖిల్ కి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



