'గేమ్ ఛేంజర్' నుంచి కీలక అప్డేట్!
on May 10, 2023

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. చరణ్-శంకర్ కలయికలో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది.
వెయ్యి మందికి పైగా ఫైటర్లతో 'గేమ్ ఛేంజర్' క్లైమాక్స్ ను అత్యంత భారీస్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయిందని తాజాగా దర్శకుడు శంకర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అంతేకాదు వెంటనే 'ఇండియన్-2' షూటింగ్ లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. శంకర్ ఓ వైపు రామ్ చరణ్ తో 'గేమ్ ఛేంజర్' చేస్తూనే, మరోవైపు కమల్ హాసన్ తో 'ఇండియన్-2' చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల షూటింగ్ పారలల్ జరుగుతోంది.
'గేమ్ ఛేంజర్'లో కియారా అద్వానీ, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



