14 దేశాల్లో టాప్ 10లో ట్రెండ్ అవుతోన్న 'మేజర్'
on Jul 15, 2022

థియేటర్లలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న అడివి శేష్ సినిమా 'మేజర్', జూలై 3న ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. శశికిరణ్ తిక్క డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు చేసి, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ప్రపంచవ్యాప్తంగా వీక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. నవంబర్ 11 ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన టెర్రరిస్ట్ దాడిలో పలువురి ప్రాణాలు కాపాడి, అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా ఈ సినిమా రూపొందింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం 14 దేశాల్లో టాప్ 10లో నిలుస్తోంది 'మేజర్'. ఇది అతి పెద్ద విజయం.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఈ మూవీకి మంచి వ్యూస్, రివ్యూస్ దక్కుతున్నాయి. బహ్రైన్, బంగ్లాదేశ్, కువైట్, మలేసియా, మాల్దీవులు, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సింగపూర్, శ్రీలంక, సౌదీ అరేబియా తదితర 14 దేశాల్లో టాప్ 10 ఫిలిమ్స్‌లో ఒకటిగా ట్రెండ్ అవుతోన్న ఈ మూవీ, ఇండియా, మారిషస్, నైజీరియాలో నంబర్ 1 ప్లేస్‌లో ట్రెండింగ్‌లో ఉంది. తన అద్భుతమైన నటనతో అడివి శేష్ అందరి హృదయాల్నీ చూరగొంటున్నాడు.
ఈ మూవీ సాధిస్తోన్న విజయంపై అడివి శేష్ స్పందిస్తూ, "నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మా ఫిల్మ్ అందుకుంటున్న ప్రేమకు కృతజ్ఞుడనై ఉంటాను. ఇది మాకు గర్వపడే క్షణం. ఈ సినిమాకు లభిస్తున్న అభిమానం, ఆదరణ చూస్తుంటే సర్రియల్ ఫీలింగ్ కలుగుతోంది" అన్నాడు. 'మేజర్'కు కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చింది అతనే. శేష్ తల్లితండ్రుల పాత్రలను రేవతి, ప్రకాశ్‌రాజ్ చేయగా, అతని భార్యగా సాయీ మంజ్రేకర్ నటించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



