కోర్టుకెళ్లిన సమంత.. యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా
on Oct 20, 2021

ఇటీవల కాలంలో మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఎక్కువగా వినిపించిన పేరు సమంత. నాగ చైతన్య తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత ఆమెని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమెపై రకరకాల కామెంట్స్ చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శించాయి. ఈ క్రమంలో తన పరువుకి భంగం వాటిల్లిందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై సమంత పరువు నష్టం దావా వేశారు.
తన పరువుకి భంగంవాటిల్లిందని సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీతోపాటు సీఎల్ వెంకట్రావుపై సమంత పరువు నష్టం దావా వేశారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి కోర్టుని ఆశ్రయించిన ఆమె.. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తూ తనని కించపరిచారని పిటిషన్ లో పేర్కొన్నారు. తనపై దుష్ప్రచారం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై ఈ రోజు(బుధవారం) సాయంత్రం సమంత తరఫు న్యాయవాది తమ వాదన వినిపించనున్నారు.
సమంత వేసిన పరువు నష్టం దావా పిటిషన్ పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



