సూరి లక్కీ సీజన్ లో `ఏజెంట్`!
on Oct 23, 2021
స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా తెలుగునాట తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సురేందర్ రెడ్డి. `అతనొక్కడే` (2005)తో దర్శకుడైన సూరి.. ఆపై `కిక్` (2009), `రేసు గుర్రం` (2014), `ధృవ` (2016), `సైరా.. నరసింహారెడ్డి` (2019) చిత్రాలతో నిర్దేశకుడిగా మంచి విజయాలు చూశాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ కెప్టెన్.. అఖిల్ అక్కినేనితో `ఏజెంట్` అనే స్పై థ్రిల్లర్ చేస్తున్నాడు. అదయ్యాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ మూవీ తీయబోతున్నాడు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ పూర్తిచేసుకున్న `ఏజెంట్`ని వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని బజ్. వాస్తవానికి ఈ చిత్రాన్ని తొలుత డిసెంబర్ 24న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా తప్పలేదు. ఈ నేపథ్యంలోనే.. సమ్మర్ ని టార్గెట్ చేసినట్లు సమాచారం. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. సురేందర్ రెడ్డి తొలి చిత్రం `అతనొక్కడే`తో పాటు `కిక్`, `రేసు గుర్రం` వంటి బ్లాక్ బస్టర్స్ కూడా ఈ సీజన్ లోనే కాసుల వర్షం కురిపించాయి. మరి.. ఆ చిత్రాల జాబితాలో `ఏజెంట్` కూడా చేరుతుందేమో చూడాలి.
Also Read