అడవి శేషు మాటలన్నీ అక్షర సత్యాలేనా!
on Dec 27, 2022

హైదరాబాదుకి చెందిన ఆయన కాలిఫోర్నియాలో పెరిగాడు. కానీ సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో మరలా ఇక్కడికి వచ్చి దర్శకునిగా స్క్రీన్ ప్లే రైటర్ గా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ హీరో ఎవరు అంటే అడవి శేషు సన్నీ చంద్రా అని చెప్పాలి. నటుడు కావాలనే తపనతో తానే దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో 2010లో కర్మ అనే చిత్రం చేశాడు. ఆ తర్వాత పంజా చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించాడు. రవితేజ బలుపు, ప్రభాస్ బాహుబలి ది బిగినింగ్ చిత్రాలలో కొన్ని పాత్రలను చేశాడు. లేడీస్ అండ్ జెంటిల్‌మేన్‌తో ఈయనకు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత దొంగాట మూవీలో నటించాడు. కానీ హీరోగా మారి ఆయన చేసిన చిత్రాలు ఆయనకు మంచి పేరు తీసుకుని వచ్చాయి. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా సైజ్ జీరో,కిస్, ఊపిరి వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఆయనకు ప్రధానంగా పేరు తెచ్చినవి మాత్రం క్షణం, అమితుమీ, గూడచారి, ఎవరు, మేజర్, హిట్ 2 అనే ఆరు చిత్రాలను చెప్పుకోవాలి. ఆరు చిత్రాలలో నాలుగు చిత్రాలకు ఆయనే స్వంతంగా స్క్రీన్ ప్లే అందించాడు.
తాజాగా ఆయన టాలీవుడ్ పరిశ్రమపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ లో ఒక వెబ్ పోర్టల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధమైన కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో బందు ప్రీతి చాలా ఎక్కువ. అందుకే హీరో పాత్రలు చేయడానికి ఆడిషన్స్ అనే సంస్కృతి లేదు. బయట వ్యక్తులకు ఆడిషన్స్ చేయరు. ఆడిషన్స్‌కు కొత్తవారిని పిలిచే సాహసం చేయరు. టాలీవుడ్ లో లీడ్‌రోల్ ఆల్‌రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సినిమా బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న ఫ్యామిలీ నుండి నేరుగా లీడ్ రోల్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. మెయిన్ రోల్ తో పాటు ఇతర ప్రాముఖ్యత ఉన్న పాత్రలకు, కీలక పాత్రల కోసం ఆడిషన్స్ ఉండవు. కేవలం హీరో పక్కన ఉండే ఒక బ్యాచ్ సైడ్ ఆర్టిస్టుల కోసం మాత్రమే ఆడిషన్స్ జరుగుతాయి. ఒక్కో సినీ ఫ్యామిలీలో దాదాపు డజన్‌కు పైగా హీరోలు ఉన్నారు. అందుకే బయటి వారికి అవకాశాలు రావడం లేదు. మంచి కథలన్నీ మొదట వారసులకి వెళ్తాయి. వారిని దాటిపోయి మనదాకా రావాలంటే మనం ఎక్కడో ఉంటాం. ఈ పద్ధతిని మార్చాలని నేను స్క్రిప్ట్ రాసుకోవడం మొదలుపెట్టాను. నేను నటించిన ఆరు సినిమాలలో నాలుగు సినిమాలకు సొంతంగా స్క్రిప్ట్ రాసుకున్నాను. ఇలా స్క్రిప్ట్ రాసుకోవడం అనేది అంతా నాకే తెలుసు అనిపించుకోవడం కోసం కాదు. స్క్రిప్ట్ రాసుకోవడం వలన ఎక్కడైనా తప్పు జరిగితే అది నాకు వెంటనే తెలుస్తుంది అని చెప్పుకొచ్చాడు.
హిట్2 సినిమాలో అడవి శేషు పోలీస్ అధికారిగా తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక నేడున్న యంగ్ హీరోల్లో అందరి దృష్టి ప్రస్తుతం అడవి శేషు పైనే ఉందని చెప్పాలి. ఈయన అంటే ఏకంగా పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా నందన్ కి ఎంతో ఇష్టం. ఒకసారి అకీరానందన్ మాట్లాడుతూ తనకు అడవి శేషు అంటే ఇష్టమని స్టేట్మెంట్ ఇచ్చారు. తన తండ్రిని కూడా కాదని అడవిశేషును ఆయన అభిమానిస్తున్నాడని అకీరా చెప్పాడంటే అది నిజంగా అడవి శేష్‌కు వచ్చిన కాంప్లిమెంట్‌గానే భావించాలి. మొత్తానికి అడవి శేష్‌లో ఎంతో టాలెంట్ ఉంది. కాబట్టే ఆయన నేడు హీరోగా తన సత్తాను చాటుతున్నారని చెప్పాలి. ఏది ఏమైనా అడవి శేషు వాస్తవాలే మాట్లాడారని... ఆయన చెప్పింది అక్షర సత్యం అని సినీ పరిశ్రమంలోని పలువురు ఆయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు.!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



