స్వీట్ మెమోరీస్.. 17 ఏళ్ళ క్రితం ప్రభాస్, సిద్ధార్థ్
on Jul 15, 2022

ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్.రాజు తాజాగా ట్విట్టర్ లో 17 ఏళ్ళ క్రితం నాటి ఒక ఫోటోను షేర్ చేశారు. అందులో ప్రభాస్, సిద్ధార్థ్, ప్రభుదేవా ముగ్గురూ ఒకే తరహా ఫోజులో నిల్చొని ఉండగా.. వాళ్ళని చూసి ఛార్మి నవ్వుతూ కనిపించింది.
సిద్ధార్థ్ హీరోగా నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'(2005) సినిమాతో ప్రభుదేవా దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభాస్ తో 'పౌర్ణమి'(2006) సినిమాని తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలకు నిర్మాత ఎం.ఎస్.రాజు కావడం విశేషం. 'పౌర్ణమి' సమయంలో ఆగష్టు 28, 2005న ఎం.ఎస్.రాజు పుట్టినరోజు వేడుక జరగగా.. దానికి ప్రభాస్, సిద్ధార్థ్, ప్రభుదేవా హాజరయ్యారు. అలాగే 'పౌర్ణమి'లో నటించిన ఛార్మి కూడా వారితో ఉంది.

17 ఏళ్ళ క్రితం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అప్పుడు వారంతా కలిసి దిగిన ఫోటోను తాజాగా ఎం.ఎస్.రాజు పంచుకున్నారు. ఆ ఫొటోలో ఎం.ఎస్.రాజు తనయుడు, హీరో సుమంత్ అశ్విన్, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



