ఊహించిందే జరిగింది.. 'ఆదిపురుష్' వాయిదా!
on Oct 31, 2022
.webp)
సంక్రాంతి బరి నుంచి 'ఆదిపురుష్' తప్పుకునే అవకాశముందని కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ సినిమా వాయిదా దాదాపు ఖరారైందని, వచ్చే వేసవికి ఈ చిత్రం విడుదల కానుందని అంటున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా కనువిందు చేయనున్న చిత్రం 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో టి.సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2023, జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. కానీ అనూహ్యంగా సంక్రాంతి రేసులోకి చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి', విజయ్ 'వారిసు/వారసుడు', అజిత్ 'తునివు' ఇలా వరుస సినిమాలు రావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో థియేటర్ల కొరత ఏర్పడింది. భారీ బడ్జెట్ తో రూపొందే పాన్ ఇండియా రేంజ్ సినిమాలకు ఎక్కువ సంఖ్యలో థియేటర్స్ లో విడుదలై భారీ ఓపెనింగ్స్ రాబట్టడం అనేది చాలా ముఖ్యం. అందుకే 'ఆదిపురుష్' వాయిదా పడే అవకాశముందని కొద్దిరోజులుగా న్యూస్ వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే విడుదలైన 'ఆదిపురుష్' టీజర్ నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా గ్రాఫిక్స్.. సినిమా స్థాయికి తగ్గట్టు లేవన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. అందుకే కంగారు కంగారుగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయకుండా.. మరికొంత సమయం తీసుకొని మంచి అవుట్ పుట్ ఇవ్వాలని మూవీ టీమ్ భావిస్తోందట.
సంక్రాంతి నుంచి 'ఆదిపురుష్' వేసవికి వాయిదా పడిందని, అధికారిక ప్రకటన రావడమే మిగిలి ఉందని అంటున్నారు. రామాయణం ఆధారంగా రూపొందుతోన్న సినిమా కాబట్టి.. శ్రీరామ నవమి కానుకగా 2023, మార్చి 30న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో పాటు, అప్పటికి థియేటర్స్ సమస్య ఉండదు, పైగా వీఎఫ్ఎక్స్ వర్క్ కి కూడా కావల్సినంత సమయం ఉంటుంది. అందుకే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



