'పుష్ప 2' సాహసాలు మొదలయ్యాయి!
on Oct 31, 2022

లాంగ్ బ్రేక్ తర్వాత, 'పుష్ప 2' షూటింగ్‌ను ఎట్టకేలకు ప్రారంభించాడు అల్లు అర్జున్. దీనికి సంబంధించి జరిపిన ఫొటోషూట్ నుంచి ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రాం హ్యాండిల్ ద్వారా సినిమాటోగ్రాఫర్ మిరోస్లావ్ క్యూబా బ్రోజెక్ షేర్ చేశాడు. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ రెగ్యులర్ షూట్ మొదలైంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా 'పుష్ప: ద రూల్' రూపొందుతోంది. మొదట్లో ఈ మూవీని 2022 డిసెంబర్‌లో.. అంటే, 'పుష్ప: పార్ట్ 1' వచ్చిన ఏడాదికి తీసుకురావాలని సుకుమార్ అనుకున్నాడు. అయితే ఆ మూవీ షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది.
చూడ్డానికి ఫొటోషూట్‌లా కనిపిస్తోన్న ఒక ఫొటోను ఆదివారం మిరోస్లావ్ క్యూబా బ్రోజెక్ తన ఇన్‌స్టాగ్రాం హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు. అందులో అల్లు అర్జున్‌తో పాటు ఆయన కూడా ఉన్నాడు. ఆ ఫొటోకు, "అడ్వెంచర్ మొదలైంది. ఐకాన్ స్టార్‌కు థాంక్స్. #Movie #Pushpa #alluarjunonline #ThaggedheLe #aryasukku #mythrimoviemakers #pushpa #pushpatherule (sic)." అనే క్యాప్షన్ పెట్టాడు.
ఈ మూవీలో రష్మికా మందన్న హీరోయిన్‌గా, ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు. పుష్పరాజ్ (బన్నీ), ఇన్‌స్పెక్టర్ భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజిల్) మధ్య ఘర్షణను ఈ సీక్వెల్‌లో మనం చూడబోతున్నాం. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



