ఆదిపురుష్ దర్శకుడితో అబ్దుల్ కలాం బయోపిక్.. హీరో ఎవరో తెలుసా..?
on May 22, 2025

గత కొన్నేళ్లుగా ఎన్నో బయోపిక్ లు ప్రేక్షకులను పలకరించాయి. వాటిలో పలు చిత్రాలు ప్రేక్షకుల మెప్పు కూడా పొందాయి. ఇప్పుడు భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ కి ముహూర్తం కుదిరింది. (APJ Abdul Kalam)
విభిన్న చిత్రాలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన కోలీవుడ్ హీరో ధనుష్ (Dhanush).. ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా రూపొందుతోన్న బయోపిక్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆవిష్కరించారు. ఈ చిత్రానికి 'కలాం' (KALAM) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 'ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా' అనేది ట్యాగ్‌లైన్. ఈ బయోపిక్ ని 'తానాజీ’, ‘ఆదిపురుష్’ చిత్రాల దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్నాడు.
ఈ ప్రాజెక్ట్‌ను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, కృషన్ కుమార్, గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అబ్దుల్ కలాం జీవితం, భారత అంతరిక్ష, రక్షణ కార్యక్రమాలకు ఆయన చేసిన అమూల్యమైన సేవను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



