గేమ్ చేంజర్ గా ఇండియాని షేక్ చేస్తా
on May 22, 2025

వివి వినాయక్(VV Vinayak)దర్శకత్వంలో తెరకెక్కిన 'అల్లుడుశ్రీను' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్(Bellamkonda Sai srinivas).ఆ తర్వాత జయజానకి రామ, సాక్ష్యం, అల్లుడు అదుర్స్, రాక్షసుడు, హిందీలో చేసిన ఛత్రపతి వంటి పలు చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో తనకంటు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. ఈ నెల 30 న 'భైరవం' అనే యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన మల్టి స్టారర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohith) వంటి హీరోలు కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్స్ లో సాయిశ్రీనివాస్ తన అప్ కమింగ్ మూవీ 'హైందవ'(Haindava)గురించి మాట్లాడుతు 'హైందవ మూవీ దశావతారాల చుట్టూ కథ నడుస్తు హై స్టాండర్డ్స్ లో ఉంటు, నా కెరీర్ కి గేమ్ ఛేంజర్ గా నిలుస్తుంది. ఈ మూవీతో ఇండియాని షేక్ కూడా చేస్తానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ మాట్లాడిన ఈ మాటలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచాయి.
యాక్షన్, అడ్వెంచర్, థ్రిలర్ గా తెరకెక్కుతున్న 'హైందవ' కి లుధీర్ బైరెడ్డి దర్శకుడు. మూన్ షైన్ పిక్చర్స్ పతాకంపై మహేష్ చందు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ తో హైందవ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తు ఉన్నారు. ఈ సంవత్సరం ద్వీతీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



