పూరి - విజయ్ చిత్రానికి రెహమాన్ బాణీలు!?
on Feb 1, 2022

`ఇస్మార్ట్ శంకర్` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం `లైగర్`. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా.. ఈ ఏడాది ఆగస్టు 25న పాన్ - ఇండియా మూవీగా థియేటర్స్ లోకి రానుంది.
ఇదిలా ఉంటే.. `లైగర్` రిలీజ్ కి ముందే విజయ్ దేవరకొండతో పూరి మరో సినిమాని పట్టాలెక్కించనున్నారని టాక్. `జన గణ మన` పేరుతో రూపొందనున్న ఈ సినిమాని ఈ నెలలోనే సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారట పూరి. అంతేకాదు.. `లైగర్` రిలీజ్ అయ్యేలోపే చిత్రీకరణ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని బజ్. ఇందులో విజయ్ దేవరకొండకి జంటగా జాన్వీ కపూర్ నటించబోతోందని ప్రచారం జరుగుతోంది కూడా.
కాగా, పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ సినిమాకి `ఆస్కార్ అవార్డ్స్` విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ బాణీలు అందించబోతున్నారని సమాచారం. అదే గనుక నిజమైతే.. అటు పూరి, ఇటు విజయ్ కాంబినేషన్ లో రెహమాన్ కి ఇదే మొదటి సినిమా అవుతుంది. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానున్నది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



