నాకు బంగారు తల్లి పుట్టిందోచ్
on Aug 16, 2022

బిగ్ బాస్ సీజన్-2 కంటెస్టెంట్, యాక్టర్ సామ్రాట్ రెడ్డికి ఆగష్టు 15 న కూతురు పుట్టింది. ఈ సంతోషకరమైన విషయాన్ని సామ్రాట్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా ప్రకటించాడు. తన కూతురిని రెండు చేతుల్లో ఎత్తుకున్న ఫోటో ఒకటి ఈ పేజీ లో తన ఫాన్స్ కోసం షేర్ చేసాడు. దీంతో సామ్రాట్ సన్నిహితులు, సెలబ్రిటీస్, ఫాలోవర్లు సామ్రాట్ కి విషెస్ చెప్తున్నారు. కోవిడ్ టైములో సామ్రాట్ కర్ణాటకకు చెందిన అంజనా శ్రీలిఖితను వివాహం చేసుకున్నాడు. ఈ మ్యారేజ్ ఫంక్షన్ కి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ దీప్తి సునైనా, తనిష్ ఇలా ఎందరో హాజరయ్యారు.
కొన్ని మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న సామ్రాట్.. ‘బిగ్ బాస్’ సీజన్-2లో ఛాన్స్ కొట్టేసి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసాడు. తర్వాత అక్కడ తనీష్‌తో మంచి ఫ్రెండ్ షిప్ బాండింగ్ ఏర్పడింది. ‘బిగ్ బాస్’ ఫినాలే వరకు వచ్చిన సామ్రాట్ ఫైనల్ ఫిఫ్త్ ప్లేస్ లో నిలబడ్డాడు. ఆ ఎపిసోడ్ లో కౌశల్ టైటిల్ గెలుచుకున్నాడు. సింగర్ గీతామాధురీ రన్నరప్‌గా, తనీష్ 3వ స్థానంలో నిలబడ్డారు. ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి బయటికొచ్చిన సామ్రాట్ కి తర్వాత మూవీస్ లో పెద్దగా ఛాన్సెస్ ఏమీ రాకపోయేసరికి సోషల్ మీడియాలో పెద్దగా ఆక్టివ్ లేడు. ఇక ఇప్పుడు తనకు కూతురు పుట్టిందంటూ సోషల్ మీడియాలో ప్రకటించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



