వీళ్లిద్దరికీ ఇక్కడ నిశ్చితార్ధం జరుగుతున్నట్టుగా ఉంది!
on Nov 18, 2022

'గాలోడు' మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ కి నందు, రష్మీ, ప్రదీప్, సుధీర్, గెహన సిప్పీ అందరూ వచ్చారు. ఇక స్టేజి మీద సుధీర్ ని, రష్మిని చూసేసరికి ఆడియన్స్ ఒక రేంజ్ లో ఈలలు వేసి వాళ్లకు వెల్కమ్ చెప్పారు. రష్మీ, సుధీర్ దూరందూరంగా నిలబడేసరికి ఆడియన్స్ హర్ట్ అవుతారని తెలుసుకున్న ప్రదీప్.. సుధీర్ ని తీసుకొచ్చి రష్మీ పక్కన నిలబెట్టాడు. అక్కడ జరిగిన ఆ సీన్ కి వెంటనే నందు మైక్ తీసుకుని "గాలోడు ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చినట్టు లేదు. మీ అందరి సమక్షంలో వీళ్లకు నిశ్చితార్థం చేస్తున్నట్టు ఉంది." అనేసరికి సుధీర్ షాకయ్యాడు.
వెంటనే నందు "సారీ డార్లింగ్" అని చెప్పాడు సుధీర్ కి. ఇక తర్వాత రష్మీ మాట్లాడింది. "సుడిగాలి సుధీర్ లో గాలి ఉంది.. గాలోడులో గాలి ఉంది. సుడిగాలి పేరుతో జబర్దస్త్ లో ఎలా ఫేమస్ అయ్యాడో, ఈ మూవీ కూడా అలాగే హిట్ అవుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. మరి ఆ గాలిని సరైన డైరెక్షన్ లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీదే ఉంది" అని ఆడియన్స్ కి మూవీ చూడమని, ఎంకరేజ్ చేయమని చెప్పింది.
"ఇప్పటివరకు నా గాలోడు, మా గాలోడు.. సినిమా రిలీజ్ అయ్యాక సుధీర్ మీ అందరి గాలోడు.. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు... ఓటిటి మూవీస్ అందులోనే చూడండి, థియేటర్స్ కోసం చేసిన సినిమాలు థియేటర్స్ లోనే చూడండి " అని చెప్పింది రష్మీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



