900 కోట్లతో శంకర్ సినిమా... ఆ ఇద్దరినీ ఫిక్స్ చేశారా?
on Feb 10, 2023

విజయ్, షారుఖ్‌ఖాన్ హీరోలుగా 900 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శంకర్ ఓ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అవతార్ తరహా మేకింగ్‌తో ఈ సినిమాను భారీగా రూపొందించడానికి శంకర్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ప్రస్తుతం రామ్‌చరణ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇందులో కియారా యాక్ట్ చేస్తున్నారు.
ఈ ఏడాది ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు కమల్‌హాసన్ హీరోగా భారతీయుడు2 తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కాజల్, రకుల్ హీరోయిన్లు. ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఒకే ఏడాది ఎట్ ఎ టైమ్ రెండు సినిమాలను సెట్స్ మీద పెట్టి, రన్ చేస్తున్న డైరక్టర్‌గా అప్లాజ్ అందుకుంటున్నారు శంకర్. ఇప్పుడు ఇదే స్పీడ్‌తో మరో అద్భుతమైన కాంబినేషన్‌ని సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అవతార్ తరహా కథతో షారుఖ్‌ని, విజయ్ ని ఇంప్రస్ చేయడానికి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారట శంకర్. ఈ సినిమాకన్నా ముందు సూర్యతో వేల్పారిని తెరకెక్కించనున్నారు.
నావల్‌ని బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించనున్నారు. మూడు పార్టులుగా తెరకెక్కనుంది వేల్పారి. అంతలో విజయ్ తన కమిట్‌మెంట్స్ ని పూర్తి చేసుకుంటారు. షారుఖ్ కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకుంటారు. సౌత్ మేకర్స్ పట్ల మంచి ఇంప్రెషన్ ఉంది షారుఖ్‌కి. ఇటు విజయ్ ఆల్రెడీ త్రీ ఇడియట్స్ సౌత్ రీమేక్ చేశారు శంకర్ డైరక్షన్‌లో. సో ఇప్పుడు సెట్స్ మీదున్న రెండు సినిమాలు, వేల్పారి కంప్లీట్ కాగానే శంకర్ నుంచి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ రెడీ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



