బుజ్జి కోసం ఏడు కోట్లు.. డార్లింగ్ మామూలోడు కాదు!
on May 22, 2024

ప్రజెంట్ ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ లో ప్రభాస్ (Prabhas) ఒకరు. ఆయన రెమ్యునరేషన్ తో భారీ బడ్జెట్ సినిమాలు తీయొచ్చు అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ప్రభాస్ ది ఆ స్థాయి. అందుకే ఆయన సినిమా బడ్జెట్ లు ఓ రేంజ్ లో ఉంటాయి. ప్రభాస్ అప్ కమింగ్ మూవీలో కేవలం ఒక కారు కోసం.. ఏకంగా రూ.7 కోట్లు ఖర్చు పెట్టారనే వార్త హాట్ టాపిక్ గా మారింది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కల్కి 2898 AD' (kalki 2898 AD). వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా.. జూన్ 27న విడుదల కానుంది. ఇందులో భైరవ (Bhairava) పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. అలాగే ఆయన బుజ్జి (Bujji) అనే అడ్వాన్స్డ్ వెహికిల్ ను ఉపయోగించనున్నారు. బుజ్జిని 'కల్కి' కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది ఎగిరే కారు అని తెలుస్తోంది. దీని కోసం రూ.7 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు సమాచారం.
'కల్కి' అనే సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కోసం.. నేటి టెక్నాలజీకి మించి, అడ్వాన్స్డ్ గా తాము కొన్ని వెహికిల్స్ రూపొందిస్తున్నామని.. ఈ విషయంలో మీ హెల్ప్ కావాలంటూ దర్శకుడు నాగ్ అశ్విన్.. రెండేళ్ల క్రితం ఆనంద్ మహీంద్రాను కోరిన సంగతి తెలిసిందే. దీంతో మహీంద్రా రంగంలోకి దిగి.. కల్కి టీంకి తమ వంతు సాయం చేశారు. అలా రూపొందించిన కార్లలో బుజ్జి ఒకటని తెలుస్తోంది. మనుషులతో మాట్లాడేలా, గాలిలో ఎరిగేలా.. చాలా అడ్వాన్స్డ్ గా ఈ కారుని రూపొందించినట్లు సమాచారం. అందుకే అంత ఖర్చు అయిందట.

అలాగే, 'కల్కి'లో ప్రభాస్ ధరించిన జాకెట్ కి కూడా రూ.2 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు వినికిడి. అదొక సూపర్ హీరో సూట్ అని.. దాని నుంచి బుల్లెట్లు కూడా పేల్చవచ్చని సమాచారం. మొత్తానికి కారు, జాకెట్ కోసమే దాదాపు పది కోట్లు ఖర్చు పెట్టారని అంటున్నారు. దీనిని బట్టి మొత్తం సినిమాకి ఎంత ఖర్చయిందో ఊహిస్తుంటే.. దిమ్మతిరిగి పోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



