ప్రముఖ సినీ నటి దారుణ హత్య
on May 22, 2024

ప్రముఖ సినీ నటి హత్యతో యావత్తు ఇండియన్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురవుతుంది. సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోను సేవ చెయ్యాలనుకున్న ఆమె ఆశలన్నీ ఒక్కసారిగా గల్లంతయ్యాయి
విద్య.. కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి నటి అనే పేరు సంపాదించుకుంది.భజరంగీ, వజ్రకాయ, వేద, జై మారుతి 800 , అజిత్ వంటి ఎన్నో హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. పైగా వాటిల్లో కన్నడ సూపర్ స్టార్స్ శివరాజ్ కుమార్, చిరంజీవి సర్జా సినిమాలు కూడా ఉన్నాయి. 2018లో నందీష్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది.ఇప్పుడు అతనే విద్య ని హత్య చేసాడు.కొన్ని రోజులుగా ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు.ఈ క్రమంలో మే 20న ఇద్దరి మధ్య ఫోన్‌లో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత విద్య రాత్రికి రాత్రే ప్రస్తుతం తను ఉంటున్నశ్రీరాంపూర్ నుంచి బయలుదేరి మైసూర్‌లోని తుర్గనూర్ చేరుకుని నందీష్ తో గొడవకు దిగింది. దాంతో నందీష్ విద్యపై సుత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన విద్య అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం అక్కడనుంచి పారిపోయాడు.

సమీపంలోని బన్నూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మైసూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సీమా లట్కర్, అదనపు ఎస్పీ డాక్టర్ నందిని, నంజన్‌గూడు డీవైఎస్పీ గోవిందరాజులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులు, బంధువుల నుంచి సమాచారం కూడా సేకరించారు. పరారీలో ఉన్న నందీష్ కోసం గాలిస్తున్నామని హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం విద్య రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటుంది. మైసూర్ సిటీ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేస్తుంది. ఇక విద్య ,నందీష్ లకి ఇద్దరు ఆడపిల్లలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



