ఎన్టీఆర్ దేవర ని టార్గెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
on May 22, 2024

చూడు పవన్ కళ్యాణ్ (pawan kalyan) మాకు కావాల్సింది ఎప్పుడు ఇస్తావ్. నువ్వు ఇస్తావా లేక మా స్టైల్లో మమ్మల్ని వెళ్లిపొమ్మంటావా. అది నెరవేర్చుకునే మార్గం కూడా మాకు తెలుసు. ఇలా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. రెచ్చిపోవడమే కాదు ఆల్రెడీ పని కూడా మొదలు పెట్టారు. దీంతో పవన్ మూవీ మార్కెట్ లో లేకపోయినా ఉన్నట్టుగానే ఉంది. ఇంతకీ వాళ్ళు ఏం అడుగుతున్నారు. ఏం చేస్తున్నారు
పవన్ అప్ కమింగ్ మూవీస్ లో ముందు రాబోయేది ఓజి (og) ఇందులో ఎవరకి ఎలాంటి డౌట్ లేదు. పవన్ ఫ్యాన్స్ (pawan fans)లోను ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. కొన్ని రోజులుగా మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితేనేం మేకర్స్ నుంచి ఎలా రాబట్టుకోవాలో తెలుసు అనే విధంగా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ సత్తా చాటుతున్నారు. ఫస్ట్ సాంగ్ కావాలని ఓజి హాష్ ట్యాగ్ ని జోడిస్తు సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. రెండు రోజుల నుంచి ఇదే పని మీద ఉన్నారు. దీంతో ఓజి హంగామా సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ గా మిగిలింది.ఇక పవన్ ఫ్యాన్స్ ఎందుకు అలా అడుగుతున్నారో కూడా క్లియర్ గా అర్ధమవుతుంది. రీసెంట్ గా పలు భారీ సినిమాల తాలూకా ఫస్ట్ సింగిల్స్ వస్తున్నాయి.ఎన్టీఆర్ (ntr) దేవర (devara) కూడా ఆ లిస్ట్ లో ఉంది.ప్రస్తుతం సినీ మార్కెట్ మొత్తాన్ని దేవర సాంగ్ ఒక ఊపు ఊపుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కి కూడా ఆ జోష్ కావాలి. ఈ నేపథ్యంలోనే సాంగ్ ని అడుగుతున్నారు.మరి ఓజి టీం నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి
.webp)
ఆల్రెడీ థమన్ ఇచ్చిన హంగ్రీ చీతా ట్యూన్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. పవన్ సరసన అందాల భామ ప్రియాంక మోహన్ జోడీ కడుతుంది. ప్రభాస్ తో సాహోని తెరకెక్కించిన సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల బయటకి వచ్చిన సుజిత్, పవన్ పిక్స్ వైరల్ కూడా అయ్యాయి. పవన్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ దానయ్య నిర్మిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



