ఆరేళ్ళ `24`!
on May 6, 2022

దక్షిణాదిన `టైమ్ ట్రావెల్` కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాలు పరిమిత సంఖ్యలోనే తెరకెక్కాయి. వాటిలో `24` ఒకటి. వెర్సటైల్ కెప్టెన్ విక్రమ్ కె. కుమార్ రూపొందించిన ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ సూర్య మూడు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నారు. మరీముఖ్యంగా.. ఆత్రేయ పాత్రలో సూర్య పండించిన విలనిజం సినిమాకి ఎస్సెట్ గా నిలిచింది. సమంత, నిత్యా మీనన్ కథానాయికలుగా నటించిన ఈ భారీ బడ్జెట్ మూవీలో శరణ్య, అజయ్, గిరీశ్ కర్నాడ్, సుధ, సత్యన్, హర్షవర్థన్, మోహన్ రామన్, చార్లీ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
స్వరమాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ సంగీతసారథ్యంలో రూపొందిన పాటల్లో ``ప్రేమ స్వరములలో``, ``దైవం రాసిన కవిత``, ``కాలం నా ప్రేయసిలే``, ``లాలీ జో``, ``మనసుకే`` ఆకట్టుకున్నాయి. తిరు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరొక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2డి ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మించిన `24`.. `బెస్ట్ సినిమాటోగ్రఫీ`, `బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్` విభాగాల్లో జాతీయ పురస్కారాలను.. `క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్` విభాగంలో `ఫిల్మ్ ఫేర్` అవార్డుని సొంతం చేసుకుంది. 2016 మే 6న తమిళ, తెలుగు భాషల్లో ఒకే రోజున విడుదలై ఆదరణ పొందిన `24`.. నేటితో ఆరు వసంతాలను పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



