బ్లాక్ బస్టర్ మల్టిస్టారర్ `వారసుడు`కి 29 ఏళ్ళు!
on May 6, 2022

తెలుగునాట మల్టిస్టారర్స్ కి చిరునామాగా నిలిచిన అగ్ర కథానాయకుల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. తన తరువాతి తరం టాప్ స్టార్ కింగ్ నాగార్జునతో కలిసి కృష్ణ నటించిన `వారసుడు` కూడా మల్టిస్టారర్ తరహా చిత్రమే. ఇందులో కృష్ణ, నాగ్.. తండ్రీకొడుకుల పాత్రల్లో అలరించారు. బాలీవుడ్ మూవీ `ఫూల్ ఔర్ కాంటే` (అజయ్ దేవగణ్, మధుబాల, అమ్రిష్ పురి)కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగ్ కి జోడీగా నగ్మా నటించగా.. శ్రీకాంత్, దేవరాజ్, బ్రహ్మానందం, బాబూ మోహన్, గుమ్మడి, తిరుపతి ప్రకాశ్, పృథ్వీరాజ్, జీవా, శరత్ సక్సేనా, తనికెళ్ళ భరణి, గీత, హేమ, మాస్టర్ బాలాదిత్య ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మురళీమోహన్ సమర్పణలో శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. కిశోర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.
స్వరవాణి కీరవాణి బాణీలు అందించిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి, భువనచంద్ర, వెన్నెలకంటి సాహిత్యమందించారు. ``పాప హలో హలో``, ``డేంజర్ డేంజర్``, ``సిలక లాగా``, ``ఛమ్ ఛమ్ ప్రియా``, ``ధిన్ తనక్ ధిన్``.. అంటూ ఎస్పీబీ, చిత్ర గానం చేసిన ఇందులోని అన్ని పాటలు కూడా విశేషాదరణ పొందాయి. 1993 మే 6న విడుదలై అఖండ విజయం సాధించిన `వారసుడు`.. నేటితో 29 వసంతాలను పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



