చైతూ, తమన్నా `100 % లవ్`కి 11 ఏళ్ళు!
on May 6, 2022

యువ సామ్రాట్ నాగచైతన్యకి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ భలేగా అచ్చొచ్చాయి. మరీముఖ్యంగా.. తన కెరీర్ ఆరంభంలో బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో చేసిన `100 % లవ్` చిత్రం యువతరానికి చేరువ చేసింది. బావ-మరదలు మధ్య సాగే `లవ్ - హేట్ రిలేషన్ షిప్` చుట్టూ అల్లుకున్న ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో బాలుగా చైతూ, మహలక్ష్మిగా తమన్నా పోటీపడి నటించారు. కేఆర్ విజయ, విజయ్ కుమార్, నందు, తారా అలీషా బెర్రీ, నరేశ్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎమ్మెస్ నారాయణ, సత్యం రాజేశ్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించగా.. మేఘనా నాయుడు, మరియమ్ జకారియా ప్రత్యేక గీతంలో చిందులేశారు.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరకల్పనలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలన్నీ కుర్రకారుని ఫిదా చేశాయి. ``ఇన్ఫాచ్యుయేషన్``, ``ఏ స్క్వేర్ బి స్క్వేర్`` (రెండు వెర్షన్స్), ``దటీజ్ మహాలక్ష్మి``, ``అహో బాలు``, `దూరం దూరం``, `బంధమెక్కడో``, ``డియాలో డియాలో``.. ఇలా ఇందులోని ప్రతీ గీతం ఆకట్టుకుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించిన `100 % లవ్`.. తమిళంలో `100% కాదల్`, బెంగాలీలో `ప్రేమ్ కీ భుఝుని` పేర్లతో రీమేక్ అయింది. 2011 మే 6న విడుదలై విజయం సాధించిన `100% లవ్`.. నేటితో 11 వసంతాలను పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



