24 ఏళ్ల అమ్మాయితో రిలేషన్‌లో 57 ఏళ్ల పృథ్వీ!
on Oct 30, 2022

కొన్ని సినిమాల్లో హీరోగా నటించి, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిన నటుడు పృథ్వీరాజ్ రెండో వివాహం చేసుకున్నాడంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తల్లో నిజం లేదనీ, తాను శీతల్ అనే అమ్మాయితో అనుబంధంలో ఉన్నాననీ, త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామనీ ఆయన తెలియజేశాడు. 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో ఆశా షైనీని పెళ్లాడే యువకునిగా పృథ్వీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. వెంకటేశ్, పృథ్వీ, ఇతరులపై చిత్రీకరించిన "ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది.." పాట ఎంత పాపులరో తెలిసిందే.
కాగా పృథ్వీరాజ్‌కు బీనాతో చాలా కాలం క్రితం పెళ్లయింది. అయితే ఆరేళ్లుగా తమ మధ్య గొడవలు జరుగుతున్నాయనీ, అందుకే ఆమెతో వేరుపడి బయటకు వచ్చేశాననీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు పృథ్వీ. ఆ తర్వాత ఆయన శీతల్ అనే యువతి ప్రేమలో పడ్డాడు. ఆమెను పృథ్వీ రెండో వివాహం చేసుకున్నాడేది కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం.
ఒంటరితనం కుంగుబాటుకు లోనుచేస్తుందనీ, తను ఆ బాధను అనుభవించాననీ, అలాంటి టైమ్‌లోనే తనకు శీతల్ పరిచయమయ్యిందనీ పృథ్వీ తెలిపాడు. తమ అభిరుచులు కలిసి, స్నేహితులమయ్యామనీ, ప్రస్తుతం అనుబంధంలో ఉన్నామనీ ఆయన అన్నాడు. ఆమె వయసు 24 సంవత్సరాలు అని కూడా వెల్లడించాడు. పృథ్వీ వయసు 57 సంవత్సరాలు కావడం గమనార్హం.
వయసు తేడా అనేది పెద్ద విషయం కాదని అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న శీతల్ తెలిపింది. తమ ఇంట్లోవాళ్లకు తమ విషయం తెలుసనీ, పెళ్లికి వారి అంగీకారం ఉందనీ ఆమె చెప్పింది. తను వయసులో చిన్న అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నానంటూ ట్రోల్స్ వస్తుండటం వల్లే పృథ్వీ ఈ ఇంటర్వ్యూ ఇచ్చినట్లు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



