చిరంజీవి `పున్నమి నాగు`కి 42 ఏళ్ళు!
on Jun 13, 2022

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ ఆరంభంలో పలు వైవిధ్యభరితమైన పాత్రల్లో ఆకట్టుకున్నారు. వాటిలో `పున్నమి నాగు` చిత్రంలో పోషించిన నాగులు పాత్ర ఎంతో ప్రత్యేకం. కన్నడ చిత్రం `హుణ్ణిమేయ రాత్రియల్లి` (1980) ఆధారంగా రూపొందిన ఈ సినిమాని మాతృక దర్శకుడు రాజశేఖర్ తెరకెక్కించారు. ఇందులో చిరంజీవికి జోడీగా మేనక (కీర్తి సురేశ్ తల్లి) నటించగా.. నరసింహ రాజు, రతి అగ్నిహోత్రి మరో జంటగా దర్శనమిచ్చారు. జయమాలిని, సుమంగళి, పద్మనాభం, మిక్కిలినేని, ధూళిపాల, రామదాసు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.
చక్రవర్తి సంగీతమందించిన ఈ చిత్రంలో ``పున్నమి రాత్రి`` అంటూ మొదలయ్యే పాట విశేషాదరణ పొందింది. అలాగే ``గడుసు పిల్లది``, ``జలకాలు ఆడేటి``, ``నీదేంపోయే``, ``అద్దిరబన్న ముద్దుల గుమ్మ`` గీతాలు కూడా రంజింపజేశాయి. ఏవీయమ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం. కుమరన్, ఎం. శరవణన్, ఎం. బాలసుబ్రమణియం నిర్మించిన `పున్నమి నాగు`.. 1980 జూన్ 13 విడుదలై ఘనవిజయం సాధించడమే కాకుండా చిరంజీవికి నటుడిగా ఎంతో పేరు తీసుకువచ్చింది. నేటితో ఈ క్లాసిక్ 42 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



