ఒకరి మీద ప్రేమతో కోడిని చంపిన సాయిపల్లవి!
on Jun 13, 2022
'ఫిదా' నుంచి 'విరాటపర్వం' వరకు సాయి పల్లవి జర్నీని ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు. తన డాన్స్ కి, నటనకు, వాయిస్ కి, తన ఆటిట్యూడ్ కి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సాయి పల్లవి బేసిగ్గా వెజిటేరియన్ .. కానీ ఒక వ్యక్తి కోసం షాప్ కి వెళ్లి ఒక కోడిని తెచ్చింది. దాని మీద ఉన్న ఈకల్ని గ్లవ్స్ వేసుకుని మరీ తీసి అంతా క్లీన్ చేసి వండి తీసుకెళ్లి ఇచ్చిందట.
"నాకు చాలా బాధేస్తుంది ఆ విషయం గురుంచి తలచుకున్నప్పుడల్లా. కోడిని చంపి కూర వండడం నాకు అస్సలు నచ్చలేదు. కానీ అలా ఒకరికి చికెన్ వండి పెట్టడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళకోసం కోడి కూర వండిపెట్టేంత ప్రేమ నాలో ఉందా అని నాకే నవ్వొచ్చింది." అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది సాయిపల్లవి.
ఐతే ఆ వ్యక్తి ఎవరు అనే విషయం మాత్రం మాత్రం చెప్పలేదు. కొంతమందైతే గతంలో పల్లవి ఎవరితోనో ప్రేమలో పడివుంటుందనీ, అతని గురించే చెప్పి వుంటుందనీ ప్రచారం మొదలుపెట్టేశారు. మొత్తానికి తన జీవితంలో మరిచిపోలేని ఒక మూమెంట్ ని పంచుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.