ఎన్టీఆర్ `యుగ పురుషుడు`కి 44 ఏళ్ళు!
on Jul 14, 2022

నటరత్న నందమూరి తారక రామారావు - అందాల తార జయప్రద.. చూడచక్కని జంట. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన జనరంజక చిత్రాల్లో `యుగ పురుషుడు` ఒకటి. కె. బాపయ్య దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో జగ్గయ్య, రావు గోపాల రావు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, ప్రభాకర్ రెడ్డి, రాజబాబు, చంద్రమోహన్, కాంతారావు, రాజనాల, ధూళిపాల, పుష్పలత, చలపతి రావు, మాధవి, ఫటాఫట్ జయలక్ష్మి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. బాలమురుగన్ అందించిన కథకు కె. బాపయ్య స్క్రీన్ ప్లే, జంధ్యాల సంభాషణలు సమకూర్చారు.
స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ సంగీతమందించిన `యుగ పురుషుడు`కి దిగ్గజ గీతరచయితలు ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందర రామ్మూర్తి సాహిత్యమందించారు. ఇందులోని ``ఇదిగిడిగో మన హీరో``, ``గాలి మళ్ళింది``, ``ఎక్కు ఎక్కు``, ``ఒక్క రాత్రి``, ``బొబ్బర్లంక చిన్నది`` అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకున్నాయి. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన `యుగ పురుషుడు`.. హిందీలో `మర్ద్ కి జబాన్` (ధర్మేంద్ర, పూనమ్ థిల్లాన్) పేరుతో కె. బాపయ్య డైరెక్షన్ లోనే రీమేక్ అయింది. కాగా, 1978 జూలై 14న విడుదలైన `యుగ పురుషుడు`.. నేటితో 44 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



