శ్యామలపై ఆర్జీవీ సీరియస్
on Jul 14, 2022

మూవీ ఫంక్షన్స్ కి , ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి దేనికైనా సరే యాంకర్స్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది యాంకర్స్ సహజంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం అవసరానికి మించి అన్నట్టు యాంకరింగ్ చేస్తూ చిరాకు తెప్పిస్తూ ఉంటారు. అలాంటి ఒక ఇన్సిడెంట్ రాంగోపాల్ వర్మ ఈవెంట్ లో జరిగింది.
ఈయన ఆధ్వర్యంలో లేటెస్ట్ గా వచ్చిన మూవీ 'లడ్కిస (తెలుగులో 'అమ్మాయి').. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ గా తీసిన మూవీ ఇది. ఈ మూవీలో టైటిల్ రోల్ లో పూజ భలేకర్ నటించింది. ఈ మూవీ 15న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి ఆ షోకి హోస్ట్ గా శ్యామలని పెట్టారు. యాంకర్స్ అందరూ చేసినట్టే శ్యామల కూడా కొన్ని ఫన్నీ గేమ్స్ తో అలరించడానికి ట్రై చేసింది.
తర్వాత ఆర్జీవీ ఈ మూవీ గురించి మాట్లాడి స్టేజి దిగిపోతూ ఉండగా శ్యామల అతన్ని ఆపి ఫన్ క్రియేట్ చేద్దామనుకుంది. మొదట పాజిటివ్ గా రెస్పాండ్ ఐన ఆర్జీవీ తర్వాత ఆమె మీద సీరియస్ అయ్యాడు. "సినిమా విషయంలో సీరియస్ గా ఉన్నాను. జోక్స్ కాదు వేయాల్సింది.. ఎమోషన్.. సీరియస్ నెస్ పెంచేలా మాట్లాడాలి" అంటూ వెళ్ళిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ఈ మూవీ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, చైనా భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇటీవలే కొండా మూవీతో కనిపించి అంతలోనే లడ్కి మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు ఆర్జీవీ. ఈ మూవీలో హీరోయిన్ బ్రూస్లీని అభిమానించే పాత్రలో కనిపించనుంది. మూవీ డేట్ దగ్గర పడేసరికి ప్రమోషన్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ఆర్జీవీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



